
నువ్వెవ్వరంటే ఎం చెప్పాలి?
నీలిమేఘల్లోంచి జారి హృదయం లోనికి చోచుకు పోతున్న
ప్రభాతనివేమో
చెట్ల అంచుల్లోంచి లేలేత చివుళ్ళమీంచి
మెట్లు మెట్లుగా జారి
తన్మయత్వంతో తనువును తడిమేసే
మలయమరుతానివేమో
ఉవ్వెత్తున ఎగిసిపడుతూ అలలు అలలుగా కదిలి
అందంగా పరుగెత్తె కెరటానివెమో
నువ్వెవ్వరంటే ఎం చెప్పను?
No comments:
Post a Comment