కలలు కొన్ని కవితలు కొన్ని
నిజాలు కొన్ని నిందలు కొన్ని
నిరీక్షణలు కొన్ని నిట్టూర్పులు కొన్ని
ఆశలు కొన్ని అడియాసలు కొన్ని
ఫలితాలు కొన్ని పరిష్కారాలు కొన్ని
అయినా మిగిలేఉన్నాయి కొన్ని కోరికలవి....
తీరనివి... కనురేప్పల్లో తప్ప
కనులముందుకు రాలేనివి
Followers
Saturday, September 25, 2010
Saturday, July 10, 2010
నా కలలు
నేన్నిరంతరం అలుపెరుగని స్వాప్నికురాలిని
నా కళ్ళు కలలతో మూసినప్పుడల్లా
నువ్వే కనుపిస్తావు
నా కళ్ళు మెలకువతో తెరిచినప్పుడల్లా
నువ్వే ఎదురోస్తావు
ఎక్కడికని వెళ్ళగలను?
నీ నుండి దూరంగా....
నా కళ్ళు కలలతో మూసినప్పుడల్లా
నువ్వే కనుపిస్తావు
నా కళ్ళు మెలకువతో తెరిచినప్పుడల్లా
నువ్వే ఎదురోస్తావు
ఎక్కడికని వెళ్ళగలను?
నీ నుండి దూరంగా....
Saturday, March 20, 2010
నువ్వెవరు ?

నువ్వెవ్వరంటే ఎం చెప్పాలి?
నీలిమేఘల్లోంచి జారి హృదయం లోనికి చోచుకు పోతున్న
ప్రభాతనివేమో
చెట్ల అంచుల్లోంచి లేలేత చివుళ్ళమీంచి
మెట్లు మెట్లుగా జారి
తన్మయత్వంతో తనువును తడిమేసే
మలయమరుతానివేమో
ఉవ్వెత్తున ఎగిసిపడుతూ అలలు అలలుగా కదిలి
అందంగా పరుగెత్తె కెరటానివెమో
నువ్వెవ్వరంటే ఎం చెప్పను?
Subscribe to:
Posts (Atom)